Wipro Is Hiring BCA, BSc Graduates With Rs 15000 Salary
mictv telugu

డిగ్రీ విద్యార్థులకు విప్రో గోల్డెన్ చాన్స్.. స్టైఫండ్‌, జాబ్

September 17, 2022

Wipro Is Hiring BCA, BSc Graduates With Rs 15000 Salary

డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి,. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో వారందరికీ ఓ సదవకాశాన్ని తీసుకొచ్చింది. అర్హత గల విద్యార్థలను తమ కంపెనీలో భాగం చేయాలనుకుంటోంది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) ప్రోగ్రామ్ 2022 కింద.. 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన BCA, BSc విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన సంపాదనతో పాటు మరోపక్క చదువును కూడా కొనసాగించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే..?

ఒకవేళ మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్నట్లయితే ఇది మీకు సదవకాశమని చెప్పుకోవాలి. WILP ప్రోగ్రామ్ ద్వారా.. BCA, B.Sc విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ నుంచి M.Techలో ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశాన్ని విప్రో అందిస్తోంది.

విద్యార్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా..

• 10వ తరగతి: Pass
• 12వ తరగతి: Pass
• గ్రాడ్యుయేషన్ – యూనివర్సిటీ మార్గదర్శకాల ప్రకారం 60% మార్కులు లేదా 6.0 CGPA కలిగి ఉండాలి.
• పాస్ అయిన సంవత్సరం: 2021, 2022
• బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ – BCA పూర్తి చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్- B.Sc ఉత్తీర్ణులై ఉండాలి

శాలరీ ప్యాకేజ్ వివరాలు..

• CTC: నెలకు INR 15,488.00
• మెుదటి సంవత్సరం స్టైఫండ్‌ – 15,000 + 488(ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు
• రెండవ సంవత్సరం సంవత్సరం స్టైఫండ్‌ – 17,000 + 553(ESI)
• 3వ సంవత్సరం స్టైఫండ్‌ – 19,000 + 618(ESI)
• నాల్గవ సంవత్సరం : 23,000 కార్యక్రమం పూర్తయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా పొందుతారు. సదరు ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది.