వినూత్నంగా మోదీ బర్త్ డే వేడుకలు.. 7వేల కిలోల కేకుతో..
ప్రధాని మోదీ 69వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ బేకరీ వ్యాపారులు మోదీ బర్త్ డే వేడుకులు భిన్నంగా జరుపుకున్నారు. ఏకంగా 700 అడుగుల పొడవు, 7వేల కేజీల కేకును తయారు చేసిన అటల్ బేకరీ నిర్వాహకులు.. దాంతో మోదీకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా దుకాణ యజమాని వెకారియా మాట్లాడుతూ.. కేకును సర్సన వేడుక శాలలో 700 మంది నిజాయతీ పరులైన వ్యక్తులతో కోపిస్తామని చెప్పారు. కట్ చేసిన కేకును గిరిజన జిల్లాల్లోని 370 పాఠశాలల్లోని 12వేల మంది చిన్నారులకు పంచుతామని వెల్లడించారు. దీంతో పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా అవినీతి నిర్మూలన అనే ఆలోచనతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు.. విభిన్న ప్రాంతాల్లో 370 కేకులను కోయనున్నట్లు ఆయన వెల్లడించారు.