Home > Featured > అద్బుతమైన ఫీచర్లతో..ఐఫోన్ 14 వచ్చేసింది

అద్బుతమైన ఫీచర్లతో..ఐఫోన్ 14 వచ్చేసింది

దేశవ్యాప్తంగా ఉన్న ఐఫోన్‌ ప్రియులకు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. అద్బుతమైన ఫీచర్లతో తాజాగా యాపిల్ సంస్థ తయారు చేసిన ఐఫోన్ 14ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఐఫోన్‌కు సంబంధించి ఏఏ ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? ఏ విధంగా పనిచేస్తుంది? అనే పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. అంతేకాదు, ఐఫోన్‌తోపాటు, యాపిల్‌ వాచ్‌ 8, ఎయిర్‌ పాడ్స్‌ ప్రో2లను కూడా విడుదల చేసింది.

"నాలుగు రకాల వేరియంట్లలో ఈ కొత్త ఐఫోన్‌ రూపొందించబడింది. ఐఫోన్‌ 14, 14 ప్లస్‌, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌లుగా నిర్ణయించాం. వీటిలో 6.1 అంగుళాల సైజులో 14, 14 ప్రో లభిస్తుండగా..14 ప్లస్‌, 14 ప్రో మ్యాక్స్‌ మాత్రం 6.7 అంగుళాల సైజులో ఉంటుంది. 14, 14 ప్లస్‌ ఫోన్లలో పాత ఏ 15 ప్రాసెసర్‌ వాడుతుండగా..ప్రో, ప్రో మ్యాక్స్‌లో సరికొత్త ఏ16 బయోనిక్‌ చిప్‌తో తయారు చేశాం. 48 మెగాపిక్సెల్‌ వైడ్‌యాంగిల్‌ సెన్సార్‌, 12 ఎంపీ కెమెరాను అమర్చాం. 14 ఫోన్‌ ధర 799 డాలర్లు (భారత్‌లో రూ.65 వేలు ఉంటుంది), 14 ప్లస్‌ మోడల్‌ ధర 899 డాలర్లు(భారత్‌లో రూ.75 వేలు ఉంటుంది)గా నిర్ణయించాం. ఈ నెల 16 నుంచి 14, వచ్చే నెల 9 నుంచి 14 ప్లస్‌ మోడళ్ళు మార్కెట్లో లభిస్తాయి" అని యాపిల్‌ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ వివరాలను తెలియజేశారు.

ఇక, యాపిల్ సంస్థ తాజాగా తయారు చేసిన.. యాపిల్‌ వాచ్‌ 8 విషయానికొస్తే..ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. కొత్తగా మూడు సైజులు 41,45,49 మిల్లీమీటర్లలో కొత్త రకం డిజైన్‌లు. వాచ్‌ 8, 8 యాపిల్‌ వాచ్‌లలో శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌, అలాగే, మహిళల కోసం ఉపయుక్తంగా ఉండే ఫీచర్స్‌ను రూపొందించారు. వీటిలో వాచ్‌8 ధర సుమారు రూ. 45 వేలు కాగా, ప్రీమియం మోడల్‌ అయిన వాచ్‌ 8 అల్ట్రా రూ. 80 వేలుగా ఉంటుంది.

దీంతోపాటు యాపిల్ ఇయర్‌ పాడ్స్‌ ప్రో మరింతగా ఆధునీకరించి మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిలో ఆపిల్‌ లాస్‌లెస్‌ ఆడియో కొడెక్‌ను నిక్షిప్తం చేశారు. అలాగే, ఇప్పుడున్నట్లు బయటకు పొడుగ్గా కనిపించే గొట్టంలాంటి డిజైన్‌ కాకుండా చెవిలో ఇమిడిపోయే రెక్కల్లా మార్చారు. ఈ ఇయర్‌పాడ్స్‌ ధర 249 డాలర్లుగా యాపిల్ సంస్థ నిర్ణయించింది.

Updated : 7 Sep 2022 9:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top