అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో..అల్లు అర్జున్..భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటన..!! - Telugu News - Mic tv
mictv telugu

అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో..అల్లు అర్జున్..భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటన..!!

March 3, 2023

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ప్రస్తుతం పుప్ప2లో నటిస్తున్న అల్జు అర్జున్ మరో బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. పుష్ప2 ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. పుప్ప విజయం తర్వాత దానికి పార్ట్ 2గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జును తర్వాత చిత్రం ఎవరితో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చాలామంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి.

 

మురుగదాస్, అట్లీ, ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ, బోయపాటిశ్రీను ఇలా ఎందరి పేర్లో వినిపించాయి. తాజాగా ఈ పెద్ద సస్పెన్స్ కు తెరపడింది. అర్జున్ రెడ్డి మూవీతో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అయ్యాడు. తాజాగా శుక్రవారం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఊహించని ప్రాజెక్టును అనౌన్స్ చేసి తన అభిమానులను సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ.