టిక్‌టాక్‌ను మరిపించే యాప్.. పుట్టింది హైదరాబాద్‌లోనే - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ను మరిపించే యాప్.. పుట్టింది హైదరాబాద్‌లోనే

July 4, 2020

Alternative App.

చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం ఇలీవల నిషేధించిన విషయం తెలిసిందే. భారత్‌లో విపరీతమైన క్రేజ్ పెంచుకున్న టిక్‌టాక్ కూడా తొలిగిపోవడంతో టిక్‌టాక్ యూజర్ల పరిస్థితి ఎటూ పాలుపోకుండా ఉంది. ఏం తోచక చేతులు పిసుక్కుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ టెకీలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాకు ధీటుగా మంచి మన్నికైనా యాప్స్‌ను రూపొందిస్తే రూ.20 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. ఇదిలావుండగా టిక్‌టాక్ లాంటి మరో యాప్ ప్రజల్లో ఆదరణ పొందుతోంది. దాని పేరు డబ్ షూట్. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఏమేం యాప్స్ ఉన్నాయా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. 

వారందరికీ హైదరాబాద్‌కు చెందిన డబ్ షూట్ యాప్ ఎడారిలో ఒయాసిస్సులా మారింది. ఈ యాప్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎంటచ్ కంపెనీ డెవలప్ చేసింది. ఇది ఇప్పుడిప్పుడే ఫేవరెట్ వీడియో షేరింగ్ యాప్‌గా పాపులర్ అవుతోంది. దీనికి గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్స్ కూడా బాగా పెరిగాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్, మల్లువుడ్ సినిమాల క్లిపింగ్స్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. టిక్‌టాక్ మాదిరి ఇందులో కూడా ఆడియో క్లిప్స్‌ను వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. వీడియోలను స్టేటస్‌లుగా పెట్టుకోవచ్చు. కాగా, ఇప్పటికే వికారాబాద్‌కు చెందిన 29 ఏళ్ల నస్కంటి శ్రీనివాస్ అనే యువకుడు టిక్‌టాక్‌కు ప్రత్యాన్మాయంగా ‘చాట్‌పాట్’ అనే యాప్‌ను రూపొందించాడు.