ఇంటర్‌ అర్హతతో.. 2500 ఉద్యోగాలకు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్‌ అర్హతతో.. 2500 ఉద్యోగాలకు ప్రకటన

March 22, 2022

job

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్మీడియట్ పూర్తీ చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న 2500 సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

ఈ పోస్టులకు పెళ్లికాని పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పోస్టుల ద్వారా ఇంటర్ (ఎంపీసీ)తోనే కేంద్ర ప్రభుత్వ కొలువులో సుస్థిర భవితకు మార్గం సుగమం చేసుకోవచ్చని ప్రకటించింది. మరి ఈ పోస్టులకు ఏ విధంగా ఆప్లై చేయాలి? జీతభత్యాలు ఎంత? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలను తెలుసుకుందామా..

మొత్తం ఖాళీలు: 2500

ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ) – 500
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్ఆర్‌) – 2000

1. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ)- 500
అర్హత..
ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు..
2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

2. సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)– 2000
అర్హత..
ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు..
2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..
1. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది.
2. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశ‌‌వ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌‌లైన్ టెస్టులో మెరిట్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్‌కు స్టేట్‌‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
3. ఆన్‌‌లైన్ టెస్టులో అర్హత సాధించిన కనీసం 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు.
4. అందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
5. ఇందులో అనర్హత పొందిన వారు 21 రోజుల లోపు రూ.40 చెల్లించి మిలిటరీ హాస్పిటల్‌‌లో రివ్యూ కోరవచ్చు.

ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.215. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 29, 2022
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 5, 2022
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2022
వెబ్‌‌సైట్:https://www.joinindiannavy.gov.in/