మోదీ అధికారంలో ఉండగా అది అసాధ్యం: అఫ్రిదీ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ అధికారంలో ఉండగా అది అసాధ్యం: అఫ్రిదీ

September 27, 2020

'With Modi in power, I don't see it happening' Shahid Afridi makes another bold claim on India-Pakistan series.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అఫ్రిదీ అన్నారు. అయితే ప్రస్తుత భారత్‌లో ఉన్న పాలనతో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. 

మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అది జరుగుతుంది అని నేను అనుకోవడంలేదని అన్నారు. నగదు అధికంగా ఉండే ఐపీఎల్ టీ20 లీగ్ క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద బ్రాండ్ అని.. కానీ అందులో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడకపోవడం వల్ల వారు పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నారని షాహిద్ పేర్కొన్నాడు. కాగా, అఫ్రిదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.