పదోవ తరగతి అర్హతతో.. 2,972 ఉద్యోగాలకు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

పదోవ తరగతి అర్హతతో.. 2,972 ఉద్యోగాలకు ప్రకటన

April 5, 2022

10

దేశవ్యాప్తంగా 10వ తరగతి పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఈస్ట్రన్ రైల్యే శాఖ శుభవార్తను చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నావారికి మంచి అవకాశాన్ని కల్పించింది. ఈస్ట్రన్‌ రైల్వేలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,972 ​పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ పోస్టులకు ఆప్లై చేయాలనికునేవారు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై, మే 10,2022 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది.

1. హౌరా డివిజన్ – 659 పోస్టులు
2. లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
3. సీల్దా డివిజన్ – 297 పోస్టులు
4. కంచరపర డివిజన్ – 187 పోస్టులు
5. మాల్డా డివిజన్ – 138 పోస్టులు
6. అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
7. జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు

దరఖాస్తు ఎలా చేయాలి?

1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. వెబ్‌సైట్‌లో ఉన్న హోమ్ పేజీలో నోటిఫికేషన్‌కి వెళ్లండి.
3. తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌కి వెళ్లండి.
4. అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోండి.
5. తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

అర్హత & వయో పరిమితి ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా ఎన్‌సీవిటీ/ఎస్సీవిటీ జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

అయితే, దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే, దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబిడి/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సూచించింది.
వెబ్‌సైట్: rrcer.com.