చస్తావని చెప్పిన దేవత.. తిండిలేకుండా గుంతలో... - MicTv.in - Telugu News
mictv telugu

చస్తావని చెప్పిన దేవత.. తిండిలేకుండా గుంతలో…

December 7, 2017

నమ్మకాలు చాలా గట్టివి. మూఢనమ్మకాలు మరింత గట్టివి. కర్ణాటకలో ఒక వ్యక్తి.. చావు భయంతో మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా దీక్ష చేస్తున్నాడు. తమ కులదైవం ఇలా చేయమని చెప్పిందని అంటున్నాడు.

కలబుర్గి జిల్లా నందికూర్‌ గ్రామానికి చెందిన విజయ్‌ కుమార్‌ కాంట్రాక్టర్. భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. గత ఆదివారం ఆయనకు కలలో కరిబసమ్మ అనే దేవత వచ్చిందట. నువ్వు మూడు రోజుల పాటు నీరు, నిద్ర, ఆహారం లేకుండా దీక్ష చేయాలని, లేకపోతే చచ్చిపోతావని  హెచ్చరించిందట.

దీంతో విజయ్ భయపడిపోయాడు. మంగళవారం ఇంటి దగ్గర్లోని  కరిబసమ్మ గుడి ముందు గుంత తవ్వి అందులో పసుపు, కుంకుమ, పూలు, ఆకులు వేసుకుని భక్తిప్రపత్తులతో దీక్షకు కూర్చున్నాడు. ఎండబారి నుంచి కాపాడుకోవడానికి గుంతపైన ఆకులు కప్పుకున్నాడు. మరోపక్క.. గ్రామస్తులు కూడా అతనికి అండగా నిలిచారు. దీక్ష చెయ్యి అని మరింత ప్రోత్సహించారు. ఆయన మహాభక్తుడని అక్కడే చీమల్లా మూగారు. అక్కడే వంట చేసుకుని తింటున్నారు.