అవి పాటించకుంటే ఒక్కరు నెలలో 406 మందికి అంటించగలడు - MicTv.in - Telugu News
mictv telugu

 అవి పాటించకుంటే ఒక్కరు నెలలో 406 మందికి అంటించగలడు

April 7, 2020

Without lockdown, one Covid-19 patient can infect 406 people in 30 days: Govt

కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిందే. దీని విషయంలో ఏమాత్రం అలుసు ఇచ్చినా అది ఇంకా రెచ్చిపోతుంది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ భయంకరమైన విషయాన్ని చెప్పింది. కరోనా సోకిన వ్యక్తి సామాజిక దూరం పాటించకుండా ఉంటే అతను 30 రోజుల్లో 406 మందికి కరోనాను అంటించగలడని వెల్లడించింది. 

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోగి నుంచి నెల వ్యవధిలో 2.5 మందికి మాత్రమే సోకుతుందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ‘ఐసీఎంఆర్ ప్రకారం ‘R0’ (ఆర్ నాట్) 1.5 నుంచి 4 మధ్యలో ఉంటుంది. ఒక వ్యాధి ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో తెలిపే సూచిక ఈ R0. ఇది 2.5గా ఉంటే రోగి నెలలో 406 మందికి వ్యాధిని అంటిస్తాడు. భౌతిక దూరం, లాక్ డౌన్ వంటి జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి సంక్రమణ 75 శాతం వరక తగ్గుముఖం పడుతుంది’ అని లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా 4,421 మందికి నావెల్ కరోనా వైరస్ సోకిందని, 114 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.