తెలంగాణలో మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 ఫైన్  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 ఫైన్ 

May 8, 2020

Without Mask Heavy Fines In Telangana

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను అవలంభిస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రజల అవసరాల  కోసం కొన్ని సడలింపులు ఇచ్చింది. గ్రీన్,ఆరెంజ్ జోన్లలో నిత్యావసర, ఇతర దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని షరతులను మాత్రం కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని ఆదేశించింది. 

బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరు మాస్క తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుంటే.. వారికి రూ.1000 జరిమానా తప్పదని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాదని నిర్లక్ష్యంగా బయటకు వస్తే..జేబుకు చిల్లుపడక తప్పదని హెచ్చరించారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మాస్కు లేకపోతే చేతి రుమాలు, టవల్ కట్టుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. కాగా లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా వ్యవసాయ సంబంధిత, నిత్యావసరాలు, ఉపాధి హామీ పనులు,ఆస్పత్రులు, మందుల దుకాణాలు, ఐటీ సేవలకు అనుమతులు ఇచ్చింది.