టికెట్ లేని ప్రయాణానికి రూ. 104 కోట్ల ఆదాయం - MicTv.in - Telugu News
mictv telugu

టికెట్ లేని ప్రయాణానికి రూ. 104 కోట్ల ఆదాయం

January 22, 2020

cvbgy

టికెట్టు లేని ప్రయాణం నేరం.. రైళ్లల్లో, బస్సులో సాధారణంగా కనిపించే దృశ్యం. బస్సు ప్రయాణాలు ఏమో కానీ రైలు ప్రయానాల్లో మాత్రం చాలా మంది దీన్ని పెద్దగా లెక్క చేయరు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. కానీ అలాంటి వారే రైల్వేశాఖకు కాసుల పంట పండించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి వేసిన జరిమానా ఏకంగా రూ. 104 కోట్లు తెచ్చి పెట్టింది. కేవలం పశ్చిమ మధ్య రైల్వే ఈ రికార్డు సాధించడం విశేషం. 2019కి సంబంధించిన గణంకాలను అధికారులు వెల్లడించడంతో దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

ఏప్రిల్‌-డిసెంబరు మధ్య పశ్చిమ రైల్వే విభాగంలో టికెట్టు లేకుండా ప్రయాణించిన వారికి భారీగా జరిమానాలు విధించింది. సుమారు 21.33 లక్షల కేసులను నమోదు చేశారు. దీని ద్వారా ఆ సంస్థకు రూ. 104.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబర్ నెలలోనే 2 లక్షల కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 8 శాతం ఎక్కువ కేసులు నమోదు అయినట్టు తెలిపారు. అధికారుల పనితీరుపై ప్రశంసలు వచ్చాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రయాణికుల్లో మార్పు వచ్చి టికెట్ తీసుకొని నిబంధనల ప్రకారం ప్రయాణం చేస్తారని అధికారులు అంటున్నారు.