తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ చదివిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. ఆ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మరి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
మొత్తం ఖాళీలు: 135
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్,
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
విభాగాలు..
జనరల్ మెడిసిన్,
జనరల్ సర్జరీ,
ఓబీజీ, పీడియాట్రిక్స్,
ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా
వయోపరిమితి..
అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 115
అర్హతలు..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో
ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
పే స్కేల్..
నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 115
అర్హతలు..
ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు
తెలంగాణ/ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టరయ్యి ఉండాలి
పే స్కేల్..
నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్..
The Principal, Osmania Medical College, Hyderabad-500095.
దరఖాస్తులకు చివరి తేదీ.. ఏప్రిల్ 4, 2022.
వెబ్సైట్: osmaniamedicalcollege.org