భారత ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఈ మేరకు ఒప్పంద ప్రాతిపదికన 40 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఖాళీల సంఖ్య ఎంత, జీతభత్యాలు, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే వివరాల్లోకి వెళ్తే..
మొత్తం ఖాళీల సంఖ్య: 42
సీనియర్ మేనేజర్ పోస్టులు: 27
మేనేజర్ పోస్టులు: 4
హెడ్/డిప్యూటీ హెడ్: 11
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.
పూర్తి సమాచారం కోసం https://www.bankofbaroda.in/ క్లిక్ చేయండి.