ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. ఐదుగురు భార్యలు తమ భర్తలను వదిలేసి ప్రియులతో జెండా ఎత్తేశారు. దీనికి ప్రధాని మోదీ పరోక్షంగా కారణమయ్యారు. మంచి ఉద్దేశంతో ప్రధాని ఇచ్చిన డబ్బులను ఇలా వాడుకున్న ఆ భార్యల తెలివి చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మనకు కొత్తగా అనిపించే ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే ఉద్ధేశంతో ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద భూమి ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల ఆర్ధిక సాయం చేస్తారు. మొదటి విడత రూ. 50 వేలు, రెండో విడత లక్షా యాభై వేలు, మూడో విడతగా రూ. 50 వేలను ఇంటి మహిళల ఖాతాల్లో వేస్తారు.
అయితే బారాబంకీ జిల్లా నుంచి 40 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా, మొదటి విడత అకౌంటులో పడగానే వారిలో ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ఆ డబ్బులు తీసుకొని ప్రియులతో లేచిపోయారు. ఈ విషయం తనిఖీలకు వచ్చిన అధికారులకు తెలియడంతో వారు కూడా ఖంగుతిన్నారు. అయినా సరే డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇంటి పనులు ప్రారంభించాలని జిల్లా హౌసింగ్ అధికారి సదరు మహిళల ఇళ్లకు నోటీసులు పంపారు. ఒకవేళ ఇల్లు కట్టకుంటే అకౌంట్లో వేసిన డబ్బును పారిపోయిన మహిళల భర్తల నుంచి వసూలు చేస్తామని అందులో పేర్కొన్నారు. దీంతో ఒక విడత ఇస్తే ఇచ్చారు కానీ మిగతా విడతల డబ్బు మాత్రం ఉడాయించిన తమ భార్యల ఖాతాల్లో వేయకండని ఆ భర్తలు అధికారులను వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
రేప్ సీన్లలో నా స్టయిలే వేరు – నటి కామెంట్స్ వైరల్