ఆ మెయిల్ చూసి ఆమె గుండె పగిలింది - MicTv.in - Telugu News
mictv telugu

ఆ మెయిల్ చూసి ఆమె గుండె పగిలింది

November 11, 2022

తెల్లవారు వారుజామున 3 గంటలవుతుంది. బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లి లేచింది. చిన్నారికి ఫీడింగ్ ఇస్తుండగా మనస్సులో ఏదో అలజడి. ఆమె ఆలోచనలు సూడులు తిరుగుతున్నాయి. సెలవులో ఉన్నా సంస్థపైనే ధ్యాస అంతా..వింటున్న వార్తలు అన్నీ ఎక్కడ నిజం అవుతాయోనని లోలోపల కంగారు.. ఈ లోపు తెల్లవారబోతోంది. సరిగ్గా 5.35 నిమిషాలకు కీడు శంకించింది. ఆమె అనుకున్నట్టే మెటా నుంచి మెయిల్ వచ్చింది. అది చూసి ఆమె కంగుతింది. మెటా పంపిన మొయిల్ చూడగ్గానే నా గుండె బరువెక్కింది అంటూ పోస్ట్ చేసింది. వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ఇప్పుడు అందరి గుండెల్ని పిండిస్తోంది.

అన్నేకా పటేల్.ఫేస్ బుక్ ..అదే మెటా ఉద్యోగి. కమ్యూకేషన్స్ మేనేజర్ అన్నేకా పటేల్ పనిచేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉంది. దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చులు తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణం చూపుతూ ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇస్తున్నాయి. ఫేస్‌బుక్ , ట్విట్టర్, ఆమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే వేలాది మందికి ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చాయి. చివరకు సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ పంపుతున్నాయి. ఇలా అన్నేకా పటేల్ కు మెటా నుంచి మెయిల్ వచ్చింది. ఇక జాబ్‌లోకి రావాల్సిన అవసరం లేదు అంటూ సందేశం వచ్చింది. దీన్ని చూసిన ఆమె కన్నీళ్లు ఆగేలేదు.

చేతిలో చంటిబిడ్డ…అటు ఉద్యోగం పోయిందన్న వార్త..ఆమెని నిశ్చేష్టురాల్ని చేసింది. “మెటా పంపిన మెయిల్ చూడగ్గానే నా గుండెపగిలింది.నా హృదయం భారమైన బాధతో బరువెక్కింది. ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నా..ఫిబ్రదరి దాకా లీవు ఉంది. ఈలోపే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది” అని అన్నేకా పటేల్ వాపోతోంది. మెటా ఉద్యోగం పోయింది నెక్ట్స్ ఏంటి అంటే ఏం చెప్పలేను. ఫిబ్రవరిదాకా సెలవు ఉంది. మాతృత్వం మొదటి నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా వాటిపై స్పందించలేను అంటూ అన్నేకా పటేల్ పోస్ట్ పెట్టింది.

“ఫేస్ బుక్‌లో పనిచేయాలనేది నా కల. నేను అనుకున్నట్టే 2020లో ఉద్యోగంలో చేరా. రెండున్నరేళ్లు ఎంతో ఆనందంగా పనిచేశా. అక్కడి వాతావరణం బాగా నచ్చింది. నా లైఫ్ ఇక్కడి నుంచే టర్న్ అయింది. ఎంతో సీనియర్ మంది ఉద్యోగులు స్ఫూర్తిగా నిలిచారు. ” అని ఆమె పోస్ట్‌లో రాసింది. అన్నేకా పటేల్ రాసిన ఈ లేఖ నెటిజన్ల మనస్సుని కదిలిస్తుంది. ఇలా ఈమె ఓక్కరే కాదు..ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇలాగే బాధితులుగా మిగులుతున్నారు.