మృగిణి.. 50 మందిపై యువతి అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

మృగిణి.. 50 మందిపై యువతి అత్యాచారం

January 10, 2020

Woman.

అబ్బాయి వేషంలో 50 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడింది. బ్రిటన్‌లో ఈ ఘోరం జరిగింది. గెమ్మా వాట్స్‌(21) అనే యువతి తన తల్లితో కలిసి ఉత్తర లండన్‌లో ఉండేది. అబ్బాయి పేరిట ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ యాప్‌లలో ఖాతాలు తెరిచింది. 16 ఏళ్ల అబ్బాయినని చెప్పుకొంటూ 14, 15 ఏళ్ల వయస్సున్న బాలికలతో చాటింగ్‌ చేసేది. 

నేరుగా కలుస్తానంటూ ఒత్తిడి తీసుకువచ్చేది. ఇక గెమ్మా రూపానికి ఆకర్షితులైన సదరు బాలికలు ఆమెను కలిసేందుకు ఆసక్తి చూపేవారు. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు వారిని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత.. గెమ్మా వారిపై అత్యాచారానికి పాల్పడేది. ఇలా దాదాపు 50 మంది మైనర్లపై ఆమె అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో బాలికపై అత్యాచారం చేస్తుండగా 2018లో గెమ్మాను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ మాట్లాడుతూ..ఈ దారుణాలకు ఒడిగట్టినందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. బేస్‌బాల్‌ క్యాపుతో జట్టును దాచి.. అబ్బాయిలా వేషం ధరించి బాలికలను అత్యాచారం చేసేది. ఈ క్రమంలో పలు వాయిదాల అనంతరం కోర్టు ఆమెకు శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా తాను నలుగురిని మాత్రమే అత్యాచారం చేసినట్లు అంగీకరించిందని పేర్కొన్నారు.