woman accuses Banjarahills inspector of kidnap and rape, complaint registered in vanasthalipuram
mictv telugu

వివాహితపై అత్యాచారం.. ట్రాక్ రికార్డున్న ఇన్‌స్పెక్టర్‌పై కేసు

July 9, 2022

woman accuses Banjarahills inspector of kidnap and rape, complaint registered in vanasthalipuram

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్‌రావుపై అత్యాచారం కేసు నమోదైంది. తన భర్తపై దాడి చేసి.. తనను కిడ్నాప్ చేసి.. ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తనను, తన భర్తను.. ఇన్‌స్పెక్టర్ కారులో బలవంతంగా తీసుకువెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైందని, దీంతో వెంటనే తప్పించుకొని, అతని నుంచి బయటపడి వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు. తన తలపై తుపాకీతో కొట్టి గాయపర్చినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సీఐ నాగేశ్వర్‌రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

కాగా సీఐ నాగేశ్వరరావు కు డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరుంది. గతంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన నాగేశ్వరరావు.. గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే తన టీమ్‌తో బంజారాహిల్స్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం రేపారు. ఆ కేసు విచారణలో ఎంతో పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు.. ఇలా అత్యాచారం కేసులో ఇరుక్కోవడం కలకలం రేపుతోంది.