అర కేజీ ఉల్లి చోరీ.. మహిళ అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

అర కేజీ ఉల్లి చోరీ.. మహిళ అరెస్ట్.. 

December 9, 2019

Woman 02

దేశవ్యాప్తంగా ఉల్లి నేరాలు పెద్దసంఖ్యలో సాగుతున్నాయి. లారీల్లోని, దుకాణాల్లోని, పంటపొలాల్లోని పంటను దొంగలు ఎత్తుకుపోతున్నారు. చివరికి ఇంట్లోని గడ్డలను కూడా లేపేస్తున్నారు. పంజాబ్‌లోని కపుర్తలలో అరకేజీ ఉల్లిగడ్డలను చోరీ చేసిందంటూ ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  

గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో నివసిస్తున్న కిరణ్ అనే మహిళ ఇంట్లో చిన్నచిన్నసామాన్లతోపాటు ఉల్లి కూడా తరచూ చోరీ అవుతున్నాయి. దీంతో ఆమె ఇంట్లో సీసీ కెమెరా పెట్టింది. పని మనిషి రేఖ స్టోర్ రూంలోకి వెళ్లి ఏవో దాచుకుని పోయినట్లు అందులో రికార్డయింది. కిరణ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ టీవీ పరిశీలించిన పోలీసులు పనిమనిషిని విచారించగా, అర కేజీ ఉల్లిని చోరీ చేశానని ఒప్పుకుంది. ఇతర సామాన్లు కూడా కనిపించకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.