పోసానిపై హత్యాయత్నం.. తాళ్ళతో కట్టేసి, గొంతు నుమిలి - MicTv.in - Telugu News
mictv telugu

పోసానిపై హత్యాయత్నం.. తాళ్ళతో కట్టేసి, గొంతు నుమిలి

May 20, 2022

ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం మహంతం గ్రామానికి చెందిన పోసాని అనే మహిళ వేసవి కాలం కావడంతో ఉక్క పోస్తుందని ఆరు బయట పడుకుంది. దాదాపు అర్ధరాత్రి నిద్రలో ఉండగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు, చేతులను బ్లౌజులు వేసుకొని వచ్చి పోసానిపై దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న తాళ్లతో పోసాని చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లోకి లాక్కెళ్లారు. అనంతరం గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయగా పోసాని ప్రతిఘటించింది. ఆ పెనుగులాట వల్ల కలిగిన శబ్దాల అలికిడికి మేల్కొన్న ఇరుగుపొరుగు వారు పోసాని ఇంటి వైపుగా వస్తుండగా, దుండగులు గమనించి పారిపోయారు. జరిగిన విషయాన్ని పోసాని స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పాటుకు వచ్చి మహిళను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు.