woman chased the man who stole and ran away and handed him over to the police
mictv telugu

చోరీ చేసి పరారీ.. ఉరికించి ఉతికారేసిన నర్సమ్మ

January 20, 2023

woman chased the man who stole and ran away and handed him over to the police

రోజురోజుకూ దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్ల వెంట వారి నుండి చైన్ స్నాచింగ్, మొబైల్ , పర్సులను దోచుకోవడం మాత్రమే కాకుండా పట్టపగలే బ్యాంకుల వద్ద కూడా చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని బ్యాంకులో ఓ యువకుడు మహిళ చేతిలో ఉన్న డబ్బును లాక్కొని పారిపోయాడు. వెంటనే స్పందించిన ఆమె వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఉదంతం ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో జరిగింది.

పోలీసులు, బాధితురాలి వివరాల ప్రకారం.. ఎదులాబాద్‌కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలిగా వ్యవహరిస్తోంది. రోజు వారీగా సంఘంలో జమ అయ్యే సభ్యులకు చెందిన రూ.50వేలు గురువారం ఘట్‌కేసర్‌ పట్టణంలోని యూనియన్‌ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చింది. ఆమెను గమనిస్తూ ఉన్న యువకుడు చేతిలో ఉన్న నగదు తీసుకొని పారిపోయాడు. నర్సమ్మ గట్టిగా కేకలు వేస్తూ పారిపోతున్న దొంగను సుమారు అర కిలోమీటరు వరకు వెంటాడి పట్టుకుంది. జరిగిన విషయం చెప్పడంతో స్థానికులతో కలసి యువకుడికి దేహశుద్ధి చేసింది. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. నర్సమ్మను పలువురు అభినందించారు.