సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఖరీదైన ఫోన్ కొన్నందుకు భార్య ఆత్మహత్య
పెళ్లితో ఒకటై తన జీవితంలో ప్రవేశించిన జీవిత భాగస్వామికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఖరీదైన ఫోన్‌ను కొన్నాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత అంతకంటే సర్‌ప్రైజింగ్, షాకింగ్ నిజం ఒకటి తెలిసి అతని కళ్లముందే బలవన్మరణానికి పాల్పడింది ఆ భార్య. ఈ విషాద ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో చోటుచేసుకున్నది.
మల్కాన్‌గిరి జిల్లాలోని ఎంపీవీ 14 గ్రామానికి చెందిన జ్యోతి మండల్, కన్హైలకు ఏడాదిక్రితం వివాహం జరిగింది. సరదాగా సాగుతున్న కొత్తకాపురంలో ఫోను చిచ్చుపెట్టింది. కన్హై.. ఓ ఖరీదైన ఫోన్‌ను జ్యోతికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం వీలుకాకపోవడంతో ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈఎంఐ కాస్తా ముసింది. దీంతో ఫైనాన్స్ కంపెనీకి చెందిన అధికారులు కన్హై సంతకం కోసం వారింటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆమె మనస్థాపానికి గురైంది. తనకు ఈఎంఐలో కొన్న ఫోన్‌ను బహుమతిగా ఇవ్వడం పట్ల నొచ్చుకున్నది.
భర్తతో గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన జ్యోతి.. తన భర్త ముందే పురుగుల మందు తాగింది. దీంతో షాక్ గురైన కన్హై స్పృహతప్పిపడిపోయాడు. స్థానికులు ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో జ్యోతి మరణించింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదుకానప్పటికీ.. పోలీసులు సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు.