పేషెంట్‌ను ముద్దాడిన డాక్టర్.. నిర్ధోషిగా తేల్చిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

పేషెంట్‌ను ముద్దాడిన డాక్టర్.. నిర్ధోషిగా తేల్చిన కోర్టు

June 21, 2022

తన హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ఓ లేడీ పేషెంట్ ను డాక్టర్ ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చింది. ఈ ఘటన బహ్రెయిన్‌లో చోటుచేసుకుంది. గత నెలలో బహ్రెయిన్‌లోని దక్షిణ గవర్నరేట్‌లో ఓ మహిళ(53) దంత చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లింది. అయితే ట్రీట్మెంట్ సమయంలో డాక్టర్(45)..తన నుదిటిపై మూడుసార్లు ముద్దు పెట్టాడని అతడిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ తర్వాత తన బుగ్గలపై కూడా డాక్టర్ ముద్దుపెట్టాడని ఆమె మాట మార్చింది.

అయితే క్లినిక్‌లో ట్రీట్మెంట్ సమయంలో ఆమెను ఓదార్చేందుకే తాను ఆమె నుదిటిపై ముద్దు పెట్టానని, ఆమెను ఓ తల్లిగా భావించానని తెలిపాడు. ఆ మహిళ తప్పుగా ఊహించుకొని తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ తెలిపారు. అంతేకాకుండా దంత చికిత్స పూర్తయినతర్వాత..ఆమె ఆశించిన విధంగా ట్రీట్మెంట్ జరగలేదని డాక్టర్ తెలిపారు. ఈ కేసులో డాక్టర్..పేషెంట్ ని లైంగికంగా వేధించాడనడానికి ఎలాంటి ఆధారాల్లేవని, కాబట్టి డాక్టర్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.