మహిళా కండక్టర్‌పై దాడి.. అంతా చూస్తుండగానే.. - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా కండక్టర్‌పై దాడి.. అంతా చూస్తుండగానే..

February 25, 2020

Chittoor

విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దాడి చేసి ఆమె డ్యూటీ డ్రెస్ కూడా చించేశాడు.చిత్తూరు జిల్లాదనపల్లి డిపో బస్సులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గుర్రంకొండ తరికొండల మధ్య తిరిగే బస్సులో ఈ ఘర్షణ జరిగింది. శివారెడ్డి అనే ప్రయాణికుడు టికెట్ లేకుండానే ప్రయాణిస్తున్నాడు. ఇది గుర్తించిన కండక్టర్ టికెట్‌ ఎందుకు తీసుకోలేదని గట్టిగా ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. శివారెడ్డి ఆవేశంతో ఆమెపై చేయి చేసుకున్నాడు.డ్రైవర్‌, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె డ్యూటీ డ్రెస్ చినిగిపోయింది. ప్రయాణికులు అంతా కలిసి అతన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.