కర్ణాటకలో ఘోరం జరిగింది. విజయపుర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడకనూర్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో బయటికి వెళ్లారు రేష్మా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో, ఏమైందో తెలియదు.. కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణా నది తీరంలో ఆమె శవమై తేలారు. ఆమెను అత్యంత కిరాతకంగా హత్యచేసిన దుండగులు శవాన్ని నదీ తీరంలో పడేసి పారిపోయారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారామె. ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ఆమె ఇలా హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ హత్య వెనకాల రాజకీయ కుట్ర వుందని భావిస్తున్నారు పోలీసులు. 2013లో జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించగా రేష్మాకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయపుర జేడీఎస్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీలో చేరారు.