యువకుడి వేధింపులు..బూటుతో బుద్ది చెప్పిన కానిస్టేబుల్ - MicTv.in - Telugu News
mictv telugu

యువకుడి వేధింపులు..బూటుతో బుద్ది చెప్పిన కానిస్టేబుల్

December 11, 2019

Woman 02333

యువతులను వేధిస్తున్న పోకిరీలపై సింహ స్వప్నంలా మారిపోయింది ఓ మహిళా కానిస్టేబుల్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెతకు అనుగుణంగా అకతాయిలకు బూటు దెబ్బ రుచి చూపించింది. వెకిలి చేష్టలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని బడిత పూజ చేసింది. ఓ ఆకతాయిని గల్లా పట్టుకొని బూటు కాలితో బుద్ధి చెప్పింది. యూపీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలో మహిళలపై వేధింపులు పెరిగిన సమయంలో పోకిరీని రఫ్పాడించిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

కాన్పూర్,బీతూర్‌‌ నుంచి స్కూలుకు వెళుతున్న బాలికలపై కొంత మంది యువకులు ప్రతి రోజూ అరచాకం సృష్టిస్తున్నారు. వెకిలి చేష్టలతో వారిని వేధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. చాలా రోజులు దీనిపై మౌనంగా ఉన్న ఆ బాలికలు యాంటీ రోమియో స్క్వాడ్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా పోకిరీల కోసం కాపు కాశారు. ఓ రోమియో వచ్చి బాలికలను ఏడిపిస్తుండగా అతడి భరతం పట్టింది. రెడ్ హ్యాండెడ్‌గా దొరికించుకొని కాలర్ పట్టుకొని కాలి బూటుతో రెండు చెంపలపై వాయించింది. మరోసారి ఇలా చేస్తే తాట తీస్తానని హెచ్చరించింది. యువకుడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.