ప్రయాణంలో పురిటి నొప్పులు..స్టేషన్‌లోనే ప్రసవం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణంలో పురిటి నొప్పులు..స్టేషన్‌లోనే ప్రసవం

November 21, 2019

Woman Delivers. 

మహారాష్ట్రలోని పాన్వెల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ ప్రసవించింది. గురువారం ఉదయం నేరూల్‌ నుంచి పాన్వెల్ వెళ్తుండగా ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఏం చేయాలో తెలియని ఆ మహిళ తల్లి అక్కడే ఉన్న అధికారులకు చెప్పారు. వెంటనే పాన్వెల్ స్టేషన్‌లో ఉన్న వన్ రూపీ క్లినిక్ సిబ్బంది వచ్చి పురుడు పోశారు. వైద్య సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండటంతో తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. మరింత వైద్యం కోసం వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.  

ప్రయాణాల్లో అత్యవసరంగా వైద్యం అవసరం అయితే చికిత్స చేసేందుకు వన్ రూపీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. రూపాయికీ పలు వైద్య సేవలను అందించనున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అవసరం ఉన్న వారికి వీరు వైద్యం అందించనున్నారు. ఈ వ్యవస్థ ఇప్పుడు రెండు నిండు ప్రాణాలను కాపాడింది. గర్భిణికి పురుడు పోసిన వైద్యులు, రైల్వే సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. మ్యాజిక్‌డిల్ హెల్త్ ఫర్ ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 14 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశారు.