వీళ్లు మనుష్యులేనా... - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లు మనుష్యులేనా…

August 24, 2017

భారత దేశం ఓ పుణ్య భూమి. అంతేకాదు నిండా కులం కంపు కొడుతున్న వేద భూమి కూడా. కాలం మారుతున్నది. మనుష్యూలు మారుతున్నారు.  ఇండియాలో మాత్రం కులం  చెక్కు చెదరడం లేదు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అంతేకాదు వారిని  కుల, గ్రామ బహిష్కరణలు చేస్తూనే ఉన్నారు.

ఒరిస్సాలో జరిగిన ఈ ఘటన మనిషినే ప్రతి వాణ్ణి చలింప చేస్తుంది.  ఆ ఒక్క గ్రామస్తులను తప్ప. కోరాపూట్ జిల్లా మత్తిలిలోని దళిత యువకుడు వేరే కులానికి చెందిన గౌరీకుమార్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుల కట్టుబాట్లు కాదన్నందకు  వారిని గ్రామ బహిష్కరణ చేశారు. ఊరి బయట చిన్న గుడిసే వేసుకుని జీవిస్తున్నారీ దంపతులు. గౌరీ కుమార్ గర్బం దాల్చింది. భర్త కూలీ పనిచేస్తున్నాడు. ఈమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఊర్లో వాళ్లు సాయం చేయడానికి ఎవ్వరూ  రాలేదు. ఎంత వేడుకున్నా వారి కులం గుండెలు కరుగ లేదు. ఆ సమయానికి భర్తా ఊర్లో లేడు.

చివరకు తానే పురిటి నొప్పులతోనే ఓ బట్ట తీసుకుని అడవిలోకి వెళ్లింది. అక్కడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మ త్రీపాఠి అక్కడికి చేరుకున్నారు. పిల్లల బొడ్డు కోశారు. అంబులెన్స్ ను పలిపించి ఆసుపత్రికి తరలించారు. తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నారు.

వేల ఏండ్ల నుండి కొనసాగుతున్న ఈ కుల దారుణం ఇంకా కొనసాగుతున్నదంటే ఇండియా మరింత వెనక్కి వెళ్తున్నట్లే  లెక్క. నీతులు చెప్పే వాళ్లు… చెప్తూనే ఉంటారు. కులాన్ని బతికిస్తూనే ఉంటారు. ఇండియాలో తొల్త  చేయాల్సిన ట్రీట్ మెంట్ కులం పైన్నే.