బెంగుళూరులో మరో ‘అమూల్య’.. కశ్మీర్‌కు స్వతంత్రం కావాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

బెంగుళూరులో మరో ‘అమూల్య’.. కశ్మీర్‌కు స్వతంత్రం కావాలని..

February 21, 2020

CAA

బెంగుళూరులో మరో యువతి ‘కశ్మీర్‌కు విముక్తి కావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం  సంచలనంగా మారింది. నగరంలోని టౌన్‌హాల్‌లో వివిధ కన్నడ సంఘాలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనలో పాల్గొన్న ఆరుద్ర అనే యువతి కశ్మీర్‌కు విముక్తి కావాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఆ ప్లకార్డులలో ‘ముస్లింలు, దళితులు, కశ్మీర్, బహుజన్, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లకు విముక్తి కావాలి’ అని రాసి ప్రదర్శించింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి సంపంగి రామనగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె గురించి విచారించిన పోలీసులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన అమ్యూలకు ఆరుద్ర ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని పోలీసులు వెల్లడించారు. తాను మల్లేశ్వరం కాలేజీ విద్యార్థినని ఆరుద్ర చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

కాగా, పౌరసత్వ సవరణచట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గురువారం బెంగుళూరులో నిర్వహించిన ర్యాలీలో అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో వేదికపై ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేదక మీద ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కార్యక్రమ నిర్వాహకులు ఆమె నుంచి మైక్ లాక్కుని ఆమెను బలవంతంగా కిందికి పంపారు. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే నగరానికే చెందిన ఆరుద్ర కశ్మీర్‌కు విముక్తి కావాలంటూ ప్లకార్డు ప్రదర్శించడం కలకలం రేపుతోంది.