Woman dies of electric shock in Anantapur District
mictv telugu

ఆ గ్రామంలో ఆగని కరెంటు మరణాలు.. మళ్లీ అదే ఘోరం..

November 23, 2022

ఆ గ్రామంలో ఆగని కరెంటు మరణాలు.. మళ్లీ అదే ఘోరం..  కొందరి నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని విద్యుత్  అధికారుల తీరుతో అమాయుకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లా  బొమ్మనహల్ మండలం దర్గా హోన్నూరు గ్రామాన్ని విద్యుత్ ప్రమాదాలు వెంటాడుతునే ఉన్నాయి.  20 రోజుల క్రితం 11కేవీ కరెంట్ తీగలు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకుముందే మరో మహిళ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. బుధవారం ఉదయం  పనుల కోసం పొలానికి వెళ్లిన బోయవాణి అనే మహిళ విద్యుత్ షాక్‌‌కు గురైంది. వ్యవసాయ పొలంలో కలుపును తొలగించేందుకు  భర్తతో కలసి వెళ్ళింది. అయితే అప్పటికే పొలం వద్ద విద్యుత్  కరెంటు తీగ  తెగి కింద పడింది. దీని గమనించక ఆమె విద్యుత్  తీగ  మీద కాలు వేయడంతో వెంటనే  షాక్  గురై అక్కడికక్కడే మృతి చెందింది. బోయవాణికి ఇటీవలే 6 నెలల క్రితం దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన ఓబులేసుతో వివాహం అయ్యింది. ఇంతలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంతమంది చనిపోతే అధికారులు స్పందిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులుకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.   Woman dies of electric shock in Anantapur District  Woman dies,electric shock, Anantapur,bommanahal

కొందరి నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని విద్యుత్ అధికారుల తీరుతో అమాయుకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గా హోన్నూరు గ్రామాన్ని విద్యుత్ ప్రమాదాలు వెంటాడుతునే ఉన్నాయి. 20 రోజుల క్రితం 11కేవీ కరెంట్ తీగలు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకుముందే మరో మహిళ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది.

బుధవారం ఉదయం పనుల కోసం పొలానికి వెళ్లిన బోయవాణి అనే మహిళ విద్యుత్ షాక్‌‌కు గురైంది. వ్యవసాయ పొలంలో కలుపును తొలగించేందుకు భర్తతో కలసి వెళ్ళింది. అయితే అప్పటికే పొలం వద్ద విద్యుత్ కరెంటు తీగ తెగి కింద పడింది. దీని గమనించక ఆమె విద్యుత్ తీగ మీద కాలు వేయడంతో వెంటనే షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. బోయవాణికి ఇటీవలే 6 నెలల క్రితం దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన ఓబులేసుతో వివాహం అయ్యింది. ఇంతలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంతమంది చనిపోతే అధికారులు స్పందిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులుకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.