ఇదోచిత్ర విచిత్రమైన స్టోరీ. దీన్ని చదివిన తర్వాత నోరు మూసుకుంటే మీరు గ్రేటే. మన తాన్నే కాదు అన్ని దేశాల్లో ఏదో సందర్భంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం సహజం. అయితే తైవాన్ లో ఓ జంట తీసుకున్న విడాకులు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇది కూడా మోబైల్ నుండి వచ్చిన పంచాయితే….కాక పోతే కొంచెం డిఫరెంట్.
తైవాన్ కు చెందిన లిన్ అనే మహిళ తన ఫోన్లో లైన్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకున్నది. దాని ద్వారా తన భర్తకు ఏదో విషయమై మేసేజీ పెట్టింది. దానికి సదరు భర్త గారు రెస్పాండ్ కాలేదట. ఒక సారి రెండు సార్లుకాదు ఆరు నెలల నుండి మెసేజీలు పెట్టిందట. తన మెసేజీలకు రెస్పాండ్ కానందుకు విడాకులు ఇవ్వాల్సిందేనని కోర్టులో కేసు వేసింది. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదట. అంతేకాదు తన వాళ్లుకు సేవలు చేయాలని తనకు ఆర్డర్లు వేస్తున్నాడని కూడా చెప్పింది. వాదోపవాదాలు విన్న జడ్జి ఆమెకు విడాకులు మంజూరు చేయడం కొసమెరుపు.