‘కరోనానా! అయితే నాకేంటి?’ అంది.. ఫలితం ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

‘కరోనానా! అయితే నాకేంటి?’ అంది.. ఫలితం ఇదీ!

February 17, 2020

China

కరోనా వైరస్ దెబ్బతో చైనా ప్రజలు ఇప్పుడు భయం గుప్పిటలో బతుకుతున్నారు. ఆ భయం వారిని ఎదుటి మనిషి పట్ల కఠినంగా వ్యవహరించేలా ఉసిగొలుపుతోంది. ఎదుటివారిలో వైరస్ లక్షణాలు ఎక్కడ ఉన్నాయోనని వారిపట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అక్కడి అధికారులు ప్రజలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రావద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇదిలావుండగా చైనాలోని ఓ సూపర్ మార్కెట్‌ వద్ద జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ మార్కెట్‌లోకి షాపింగ్‌కు వచ్చిన ఓ మహిళకు మాస్క్ లేదు. దీంతో ఆ మార్కెట్ సిబ్బంది ఆమెను మాస్క్ ధరించాలని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించింది. సిబ్బంది ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినలేదు. సరికదా వారిపై చేయి కూడా చేసుకుంది. దీంతో వారు ఆమెను బలవంతంగా బయటకు ఈడ్చుకు వచ్చారు. కాగా, ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మాస్క్ ధరించకపోవడం తప్పే అని యువతిని అధికశాతం మంది తప్పుబడుతున్నారు.