పెళ్లైన 3 రోజులకే వధువు పరార్.. కొంపను తగలబెట్టిన బంధవులు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లైన 3 రోజులకే వధువు పరార్.. కొంపను తగలబెట్టిన బంధవులు

June 13, 2022

పెళ్లైన మూడు రోజులకే ప్రియుడితో వధువు పరారీ కావడం కలకలంరేపింది. కోపంతో ఆగ్రహించిన వధువు బంధువులు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మాధవరం గ్రామానికి యువతిని ఈ నెల 9న రచ్చమర్రికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అంతకుముందే ఆమె తమ గ్రామంలోని శివాజీని ప్రేమించింది. పెళ్లయిన మూడో రోజున శివాజీ… ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న బంధువులు ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. అందులో దుస్తులు, బియ్యం కాలిపోయాయి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారితో కలిపి మంటలు ఆర్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.