ఈ ముచ్చట చదివి మూర్చపోగలరు...... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ముచ్చట చదివి మూర్చపోగలరు……

June 29, 2017

ఆ ముచ్చట ఇంటే గనుక మూర్చపోవాల్సిందే….  దాని గురించి చెప్పనే వొద్దు… అరే… దాన్ని అట్ల చూడగానే మూర్చ వచ్చిపడిపోయాడు… ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో వింటాం. అయితే మనకు ప్రత్యక్షంగా ఎదురైన సందర్భాలు చాలా తక్కువగా ఉంటవి. వినుడే ఎక్వ ఉంటది.  అయితే చైనాలో సోఫి అనే మహిళ మాత్రం బ్రేస్ లెట్ ధర విని మూర్చవచ్చి పడిపోయింది. ఇంటి వారు, చుట్టు పక్కల వారు సపర్యలు చేసిన కొన్ని గంటల  తర్వాత కాని  ఆమె స్పృహాలోకి రాలేదు. ఆమె సరదగా షాపింగ్ కు వెళ్లింది. షాపులో ఉన్న బ్రేస్ లెట్ వేసుకుని చూద్దామని తీసింది. అంతలోనే అది కింద పడి పగిలి పోయింది. చైనాలో  ఇది చాలా  విలువైనది.  దీన్ని ఆరోగ్యానికి మంచిదని  అక్కడి వారు భావిస్తారు.

https://youtu.be/6-Aipkf32Y4

సోఫీ పగల గొట్టిన బ్రేస్ లెట్ విలువ 30 వేల యూవాన్లని( 28 లక్షలు) షాపు ఓనర్ చెప్పాడు. ధర వినగానే ఆమె మూర్చతో కింద పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి దాని నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆరు లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. అవి చాలనదని చెప్పాడు షాపు యాజమాని. నిపుణుడితో దాని విలువను అంచనా వేయించారు. దాని విలువ 17 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పాడు. ఇగ మిగిలింది  వాయిదాల్లో కడ్తామని చెప్పారు సోఫీ కుటుంబ సభ్యులు. మరి ఇంత వింత ఘటన జరిగిన ప్రాంతం చైనాలోని యున్నన్  ప్రావిన్స్ లో.