9వ అంతస్తు నుంచి పడినా.. దులుపుకుని వెళ్లింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

9వ అంతస్తు నుంచి పడినా.. దులుపుకుని వెళ్లింది (వీడియో)

January 27, 2020

9th Floor

కొందరు అంతే చిన్న చిన్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. కొందరు మాత్రం అది ఎంత పెద్ద ప్రమాదం అయినా బతికి బట్ట కడతారు. అలాంటివాళ్లను చూసినప్పుడు మనకు వీడు మహా గట్టిపిండమే అని అనబుద్ధి అవుతుంది. భూమి మీద ఇంకా తినే బాకీ ఉందని అంటుంటారు. ఈమెను కూడా అలాగే అనాలి. 9వ అంతస్తు నుంచి ముక్కు మూసుకుని పడ్డప్పటికీ చనిపోలేదు. చక్కగా లేచి ఏమీ జరగనట్టు అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రష్యాలో ఇజ్లుచిన్స్క్ పట్టణంలోని ఒక టవర్ బ్లాక్ నుండి మహిళ(27) 9వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. ఆ తర్వాత ఓ నిమిషం అనంతరం లేచి సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన ఎత్తు ఇంచుమించు 90 అడుగులు ఉంటుంది. 

ఆమె కిందికిపడేలోపు ట్రావెల్ పలుసార్లు గాల్లో గిర్రన తిరిగింది. అయితే ఇక్కడ ఆమె అదృష్టం ఏంటంటే.. ఆమె పైనుంచి సరాసరి కింద ఉన్న మంచు కుప్పలో పడింది. దీంతో ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. అయితే సదరు మహిళ అక్కడినుంచి లేచి వెళ్లిన తరువాత తన పొరుగువారిని సంప్రదించి అంబులెన్స్‌కు ఫోన్ చేయమని కోరిందని ది సన్ పత్రిక పేర్కొంది. ఆమె ప్రస్తుతం పశ్చిమ సైబీరియాలోని చమురు సంపన్న ఖాంటీ-మాన్సీ ప్రాంతంలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది. అదరడం వల్ల బాడీలోని నరాలు కొంచెం మెల్ట్ అయ్యాయని డాక్టర్లు తెలిపారు. 

అంత ఎత్తునుంచి పడ్డాక కూడా ఆమె ఒక్క ఎముక కూడా విరగక పోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె పడిపోయిన రోజు అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 14 సి ఉండటంతో కురిసిన మంచే ఆమె ప్రాణాలను కాపాడింది. అయితే సదరు మహిళ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందా..? ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఎవరైనా తోసివేశారా అన్నది తెలియరాలేదు. ఈ వీడియో చూసిన యూజర్లు మాత్రం ఆమెను లక్కీ లేడీ అంటున్నారు. అంత పైనుంచి పడితే ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయి రక్తం కక్కి చచ్చిపోతారు కానీ, ఈమె బతకడం నిజంగా ఆశ్చర్యమే అంటున్నారు. కొందరైతే ఆమెను ఏలియన్ అంటున్నారు.