woman falls the bike after trying to kick another rider
mictv telugu

పక్కవారిని గెలకాలని చూసింది..తిక్క కుదిరింది.. (వీడియో)

November 8, 2022

woman falls the bike after trying to kick another rider

చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. ఒకరికి చెడు చేయాలని చూస్తే, తిరిగి మనకీ అదే చెడు జరిగి తీరుతుంది. ఇప్పుడు ఓ అమ్మాయి విషయంలో అదే జరిగింది. తన పని తాను చేసుకోకుండా ఎదుటివారిని గెలకాలని చూసిన యువతి బొక్కాబోర్లాపడింది.

ఓ యువకుడితో బైక్‌పై ఓ యువతి వెళ్తుంది. వారి పక్కన ఓ యువకుడు బైక్ పోనిస్తున్నాడు. ఈ సమయంలో వెనుక కూర్చున్న యువతి ఆ యువకుడి బైక్ ని కాలుతో తన్నేందుకు ప్రయత్నించింది. అయితే బ్యాలెన్స్ తప్పిన ఆ యువతి బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయింది కాగా పక్కకున్న బైకర్ యువతి తన్నడాన్ని గ్రహించలేదు. తాను దారిన తాను వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడింది. ఐతే ఇది ఎక్కడి జరిగింది అన్న విషయం తెలియలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తిక్క కుదిరింది అని కొందురు అంటుటే..చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.