ఉత్త కాళ్లతో పరిగెత్తి లక్ష గెల్చుకున్న తెలంగాణ రైతు మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్త కాళ్లతో పరిగెత్తి లక్ష గెల్చుకున్న తెలంగాణ రైతు మహిళ

June 2, 2022

సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ నిరుపేద మహిళ. సుమారు 500 మంది మహిళలు పాల్గొన్న 5 కిలోమీటర్ల పరుగు పందెంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, వట్టి కాళ్లతో పరిగెత్తి విజేతగా నిలిచి ఔరా అనిపించింది. అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన మహిళా రైతు మల్లం రమకు హుస్నాబాద్‌లో జూన్ 1 న 30 ఏళ్లు పైబడిన మహిళలకు 5కే రన్‌ నిర్వహిస్తున్నారని తెలిసింది. సరిగ్గా ఒక రోజు ముందనగా అంటే మే 31న ఆమెకు పోటీ గురించి తెలిసింది. విజేతకు రూ.లక్ష బహుమతి ఉంటుందని చెప్పడంతో.. తన పేదరికాన్ని పొగొట్టుకునేందుకు ఎలాగైనా పోటీలో గెలవాలనుకొని నిశ్చయించుకుంది. దీంతో ఎలాంటి సాధన చేయకుండానే ఈ పోటీలో పాల్గొంది. పొలం పనులు చేసే మహిళ కావడంతో.. చాలా సునాయాసంగా ప్రథమ విజేతగా నిలిచి రూ.1 లక్ష బహుమతి గెలుచుకుంది. తాను మూడో క్లాసు దాకే చదివానని.. బహుమతిగా వచ్చిన రూ.లక్షను తన కుమారుల చదువు కోసం వినియోగిస్తానని చెప్పింది.