Woman fights off robber with a cleaning cloth at her bakery in Netherlands
mictv telugu

క్లీనింగ్ క్లాత్‌తో దొంగకు చుక్కలు చూపించిన మహిళ.. వీడియో వైరల్

July 29, 2022

దొంగ‌తనానికి వచ్చిన వ్యక్తిని ఎదుర్కొని వాడిని చిత‌క్కొట్టింది ఓ మ‌హిళ‌. ఈ సంఘ‌ట‌న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీన్ని చూసిన వారు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లతీఫ్ పెకెర్ అనే మహిళ తన కుమారుడి బేకరీలో కౌంటర్ టేబుల్ ను క్లీన్ చేస్తోంది. బేకరీ డోర్ వద్దకు నల్లటి హుడీ షర్ట్ వేసుకుని వచ్చిన అగంతుకుడు గ్లాస్ డోర్ నుంచి బేకరీని పరిశీలించాడు. బేకరీలో మహిళ ఒక్కతే కనిపించడంతో.. ఈజీగా దొంగతనం చేసేయొచ్చు అనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి దూసుకొచ్చాడు. క్యాష్ డెస్క్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. మొదట అతడి చేతిలో ఆయుధం ఉందనుకుని వెనకడుగు వేసిన ఆ మహిళ.. ధైర్యం చేసి అతడి మీదకు క్లీన్ చేసే క్లాత్ తో దూసుకుపోయింది. అతడు ఆమెను తోసేసేందుకు గట్టిగా ప్రయత్నం చేశాడు. అయినా ఆమె తగ్గలేదు. బలంగా అతడిని ఎదుర్కొంది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనింగ్ క్లాత్ కు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండంటూ ఓ వ్యక్తి ట్విట్టర్ లో స్పందించడం గమనార్హం.