ఇదేం వింత? రెండు తలలు,మూడు చేతులతో శిశువు - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం వింత? రెండు తలలు,మూడు చేతులతో శిశువు

November 25, 2019

కలియుగంలో వింతలు, విడ్డూరాలకు కొదవలేకుండా పోతోంది. ఏదో ఒక సమయంలో వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏనుగు ఆకారంలో పంది, కుక్కపిల్ల పుట్టడం, ఆవుకు అంగుళంన్నర దూడ జన్మించడం ఇటీవల చూశాం.  తాజాాగా ఓ మహిళ రెండు తలలు, మూడుచేతులు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. తొలి కాన్పుకోసం ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆమెకు అనుకోని సంఘటన ఎదురైంది. ఈ విషయం తెలిసిన వారంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.

Woman.

గంజ్‌బసోడకు చెందిన బబిత (21)కు ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. ఆమె తన తొలి కాన్పు కోసం  ఇటీవ ఆస్పత్రిలో చేరింది. ప్రసవం తర్వాత బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు ఉండటాన్ని వైద్యులు గమనించారు. వెంటనే తల్లి బిడ్డలను ఐసీయూకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రెండు తలలతో పుట్టినప్పటికీ బాబుకు ఒకే గుండె ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విధంగా పిల్లలు జన్మించడం అరుదైన ఘటనగా డాక్టర్లు చెబుతున్నారు. అండాలు విడిపోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం చిన్నారిని పర్యవేక్షణలో ఉంచినట్టు చెబుతున్నారు. కాగా 2016లోనూ భోపాల్ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.