ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గురువారం ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సురత్‌గంజ్ ప్రాంతానికి చెందిన అనిత అనే మహిళ నెలలు నిండటంతో స్థానిక ఆసుపత్రిలో చేరింది. గురువారం నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు కాన్పు చేశారు. ఒకేసారి ఐదుగురు పిల్లలకు వైద్యులు పురుడుపోశారు. వారిలో ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. దీంతో పిల్లల తండ్రి కుందన్ ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు. తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారని.. తమ కుటుంబంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని.. మెరుగైన చికిత్స కొరకు ప్రస్తుతం వైద్యులు తన భార్యను బారబంకి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, సదరు మహిళకు ఇది రెండవ కాన్పు. మొదటి కాన్పులో ఆమెకు ఓ కొడుకు జన్మించాడు. రెండో కాన్పులో ఆమెకు ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది.