Woman has twins with two different dads after having fun with both men on same day
mictv telugu

ఈ కవలలకు తండ్రులు వేర్వేరు.. తల్లిగారి మహత్యం!!

September 8, 2022

టైటిల్ కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా ఇది వాస్తవం. బ్రెజిల్‌లో 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఆ మగ పిల్లలిద్దరూ పూర్తి ఆరోగ్యంతో అందంగా పుట్టడంతో అందుకు తానే కారణమనుకున్న తండ్రి ఆనందం పట్టలేకపోయాడు. ఆ కవలలు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే వారికి 8 నెలలు వచ్చాక ఆ తల్లికెందుకో వీరి అసలు తండ్రి ఎవరా అని అనుమానం వచ్చింది. అప్పటివరకూ తండ్రిగా అనుకుంటున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్‌ఏతో మాత్రమే సరిపోయిందట. మరో పిల్లాడి డీఎన్ఏ ఆ తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.

కాసేపు ఆలోచించిన మీదట ఆమెకు గతం గుర్తుకొచ్చిందట. తన ఫ్రెండ్‌తో కలసిన అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిందని గుర్తొచ్చింది. అతడికి డీఎన్‌ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని చెప్పారు.