తన కోరిక తీర్చలేదని.. బాలుడిపై మహిళ అఘాయిత్యం... - MicTv.in - Telugu News
mictv telugu

తన కోరిక తీర్చలేదని.. బాలుడిపై మహిళ అఘాయిత్యం…

October 10, 2018

మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మృగాళ్ళను చూశాం. కానీ ఈ మధ్య  మగపిల్లలపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తన కోరిక తీర్చలేదని ఓ బాలుడి జననాంగాలను పట్టుకారతో కత్తిరించింది. ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రలకు చెప్పడంతో ఆమెపై  పోలీసు కేసు నమోదైంది.

Woman hurts private parts of a boy with hot tongs in Greater Noida

దేశ రాజధాని న్యూఢిల్లీ శివారులోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. చప్రౌలా గ్రామానికి చెందిన  ఓ యువతి, తన పక్కింట్లో ఉన్న 13ఏళ్ల బాలుణ్ని తన ఇంటికి రమ్మని పిలిచింది. బాలుడు ఇంటికి రావడంతో తన  కోరిక తీర్చాలని బలవంతపెట్టింది. దానికి బాలుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో అతని జననాంగాన్ని కత్తిరించిందామె. వెంటనే బాలుడు పరుగెత్తి తన తల్లికి విషయాన్ని చెప్పాడు. దీంతో నిందితురాలిపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్, బాలల గృహహింస తదితర సెక్షన్ల కింద  యువతిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ యువతి పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.