మహిళ నోట్లో పేలుడు.. ఆపరేషన్ థియేటర్‌లో ఘోరం.. - MicTv.in - Telugu News
mictv telugu

మహిళ నోట్లో పేలుడు.. ఆపరేషన్ థియేటర్‌లో ఘోరం..

May 16, 2019

ఆపరేషన్ థియేటర్‌లో ఓ మహిళ నోట్లో పేలుడు సంభవించి ఆమె మృతిచెందింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌లోని జేఎన్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది.
స్థానికంగా నివాసం వుండే ఓ మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమె బంధువులు హుటాహుటిన ఆమెను జేఎన్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తీస్కెళ్లారు. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. ఆమె కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసేందుకు ఒక పైపును నోటి ద్వారా లోపలికి పంపారు.

Woman in UP dies after explosion in her mouth during treatment

ఇంతలో ఆమె నోట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె నోట్లో పేలుడు ఎలా సంభవించింది అన్న విషయంపై వైద్యులు వివరణ ఇచ్చారు. ఆ మహిళ సల్ఫ్యూరిక్‌ ఆమ్లం తాగిందని, నోట్లోని పైపులో ఉన్న ఆక్సిజన్‌తో చర్య జరిగి చిన్నపాటి పేలుడు సంభవించిందని అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి అసలు కారణాలు వెల్లడిస్తామని ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.