ఏడాది పాటు మహిళను బాత్రూంలో బంధించిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది పాటు మహిళను బాత్రూంలో బంధించిన భర్త

October 15, 2020

gnbfgnfgth

కట్టుకున్న భార్యపై ఓ వ్యక్తి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఏడాది కాలంగా ఓ మరుగుదొడ్డిలో బందించాడు. కనీసం తిండి కూడా సరిగా అందించకుండా చిత్రవధ చేశాడు. బలహీన స్థితిలో ఆమె అందులోనే నెలల తరబడి బందీగా ఉండిపోయింది. హరియానా లోని పానిపట్ జిల్లా రిష్పూర్ గ్రామంలో ఇది వెలుగుచూసింది. దీంతో మహిళా సంఘాలు, పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు విముక్తి కల్పించారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

35 ఏళ్ల మహిళను భర్త ఏడాది కాలంగా బాత్రూంలోనే బందించాడనే విషయం తెలిసి మహిళా సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో ఆమె పడిపోయి కనిపించింది. తిండి కూడా లేకపోవడంతో కనీసం నడవలేని స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తన భార్యకు మానసిక సమస్య ఉందని  భర్త వెల్లడించాడు. మాట వినడం లేదని అలా బందించాల్సి వస్తోందని తెలిపాడు. కానీ మహిళా రక్షణ అధికారులు మాత్రం అతడి మాటలతో ఏకీభవించలేదు. తాము ఆమెతో మాట్లాడినప్పుడు బాగానే సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. కాగా, బాధితురాలికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.