ప్రియుడిని కుక్కలా వెంటతిప్పుకుంటోంది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుడిని కుక్కలా వెంటతిప్పుకుంటోంది (వీడియో)

October 25, 2019

Woman made her lover as puppy 

‘మొగుడిని కొంగుకు కట్టేసుకుంది..’ అని అమ్మలక్కలు, ముఖ్యంగా అత్తమ్మలు వాపోతుంటారు. ఆమె వెంట కుక్కలా తిరుగుతున్నాడని ప్రియుళ్లను కూడా చులకగా మాట్లాడుతుంటారు. అవన్నీ పోలికల్లే అని పెట్టుకుంటాం. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం చెలికాణ్ని నిజంగా కుక్కలా మార్చేసింది. అతని మెడకు కుక్క గొలుసు కట్టి తిప్పుకుంటోంది. అతగాడు కూడా కుక్క శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు ముడ్డి ఊపుకుంటూ నాలుగు కాళ్లపైన తిరుగుతున్నాడు. అచ్చం కుక్కలా హావభావాలు ప్రదర్శిస్తూ ఆమె కాళ్లను నాకేస్తున్నాడు. 

 

ఇదేదో సరసం కావొచ్చని, పడకగది రొమాన్సు తతంగం కావొచ్చని అనుకుంటే పొరపాటే. జనం అందరి ముందు, నడిరోడ్డుపై ఈ వ్యవహారం సాగుతోంది. ఈ వింత చూడ్డానికి జనం గుడికూడుతున్నారు. వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. అమ్మాయి అంటే అలా ఉండాలని కొందరు ప్రశంసిస్తుండగా, గయ్యాళిగంప అని కొందరు తిడుతున్నారు. అతని స్థానంలో ఒక మహిళను, ఆమె స్థానంలో ఒక పురుషుణ్ణి ఊహించుకుంటే మహిళలు రచ్చరచ్చ చేసేవారని, ఇది మగాళ్లకు కాలం కాదని కొందరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఈ సంఘటన ఎక్కడి జరిగిందో తెలియడం లేదుగాని, సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.