తాగుబోతు భర్తలు తప్పకుండా చదవాల్సిన వార్త.. ముగ్గురు పిల్లలతో కలిసి.. - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు భర్తలు తప్పకుండా చదవాల్సిన వార్త.. ముగ్గురు పిల్లలతో కలిసి..

October 6, 2018

కట్టుకున్న భర్త.. కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిపోయి, రోజు తాగొచ్చి చిత్ర హింసలు పెట్టాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

fff

తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు మోహన్‌కు స్వాతి(25)తో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి సాత్విక (6), మధునశ్రీ (4), మమంత్‌ కుమార్‌ (3) ముగ్గురు పిల్లలు. కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న మోహన్ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పిల్లల చదువు కోసం వారు నాలుగేళ్ల కిందట అనుముల మండలం హాలియాకు వచ్చేశారు.

ఈ క్రమంలో మోహన్ మద్యానికి బాసయ్యాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. రోజుమాదిరిగానే శుక్రవారం పిల్లలను బడికి పంపిన స్వాతి, భోజనం తినిపించి తీసుకొస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం వారిని తీసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వీరి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి రాకను చూసిన స్వాతి కొడుకుని కాలువలోకి తోసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి దూకేసింది. వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వాతి, సాత్విక, మధునశ్రీలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆడపిల్లలు ఇద్దరూ మృతిచెందగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం వెతుకున్నారు.