Home > Featured > సంవత్సరంలో 55 దేశాలను చుట్టి రికార్డు సృష్టించింది!

సంవత్సరంలో 55 దేశాలను చుట్టి రికార్డు సృష్టించింది!

అనుకన్నమంటే సాధించలేనిది ఏమీ ఉండదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే దాన్ని అధిగమించి తీరుతాం. అలా వీల్ చెయిర్ లో ఉండి కూడా సంవత్సరంలో 55 దేశాలు తిరిగి ప్రపంచ రికార్డు సంపాదించింది.

రెనీ బ్రన్స్ అనే అట్లాంటాలోని జార్జియాకు చెందిన మహిళ సంవత్సరంలో అత్యధిక దేశాలను సందర్శించిన మహిళగా పేరుగాంచింది. గతేడాది జనవరి 28, 2022న ఈ రికార్డు పూర్తి చేసింది. అయితే సంవత్సరం తర్వాత ఆమె ప్రపంచ రికార్డుకు చెందిన ధృవీకరణ పత్రాన్ని అందుకొని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేసింది.
రెనీ బ్రన్స్.. వైద్య పరిస్థితి కారణంగా ఆమె వీల్ చైర్ పై ఆధారపడాల్సి వచ్చింది. అయితే అలా అని ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తాను ఏదైనా కొత్తగా సాధించాలి, ప్రపంచానికి తానేంటో చూపించాలని అనుకుంది. బ్రన్స్ ఏడేళ్ల వయసులో జ్వరం వచ్చింది. అందరిలాగే మామూలు జ్వరమే అనుకున్నారంతా.

కానీ అదే మెల్లగా ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఎముక, మృదులాస్థి అభివృద్ధిని ప్రభావితం చేసే.. డయాస్ట్రోఫిక్ డ్వార్ఫిజంతో బాధపడుతున్నానని తెలిసింది. 16యేండ్ల వయసులో పూర్తిగా వీల్ చెయిర్ కే పరిమితమైంది. అయినా కూడా ఆమె చదువును ఆపలేదు. కొన్నిరోజులు ఇన్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేసింది. ఇలా తన ప్రయాణాన్ని ఎక్కడా ఆపలేదు.

మొక్కవోని ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలరని నిరూపించింది బ్రన్స్. ఆమె ఇప్పటివరకు పెరూ, కాంబోడియా, టర్కీ, కెన్యా ఇలా 117 దేశాల వరకు చుట్టేసింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 195దేశాల్లో ఆమె ఇంకా 78 దేశాలను చుట్టి రావాలని భావిస్తున్నది. మరి దానికి ఆమె ఎంత కాలం తీసుకుంటుందో తెలియాలి. అయితే ఈమె ప్రయాణం గురించి సోషల్ మీడియాలో చాలామంది ‘భయంతో మంచం మీద పడుకోవడం కంటే ఇది చాలా మంచిది, ధైర్యంగా ఉండి ప్రయాణం కొనసాగించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated : 24 Feb 2023 6:13 AM GMT
Next Story
Share it
Top