నీ బట్టలు సరిగ్గా లేవు.. విమానంలో ఎక్కించుకోం.. - MicTv.in - Telugu News
mictv telugu

నీ బట్టలు సరిగ్గా లేవు.. విమానంలో ఎక్కించుకోం..

March 14, 2019

ఇంట్లో వున్నప్పుడు నిండుగా వుంటారో, బట్టలు విప్పదీసుకుని తందనాలు ఆడతారో మీ ఇష్టం. కానీ ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు కాస్త పద్ధతిగా వుండాలి కదా. అవన్నీ నాకు తెలీదు.. నాకు తెల్సిందల్లా ఒక్కటే నాఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరుగుతా అని విమానం ఎక్కబోయిందో యువతి. కానీ విమాన సిబ్బంది ఆమె వేసుకున్న దుస్తులు అసభ్యంగా వుండటంతో విమానం ఎక్కడానికి అనుమతించలేదు. ఈ ఘటన బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఎమిలి ఓ కాన్నర్ (21) అనే యువతి ట్రేనీ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. మార్చి 2న ఆమె థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించడానికి బర్మింగ్‌హామ్ విమానాశ్రయానికి వచ్చింది.

అప్పుడామె ఒంటిపై నల్లని టాప్ మాత్రమే వుంది. అయితే ఆమె వేసుకున్న దుస్తులు అభ్యంతరకరంగా ఉండటంతో విమాన సిబ్బంది ఆమెను లోపలికి రావడానికి నిరాకరించారు. ఇలాంటి దుస్తులతో విమానంలోకి ఎంట్రీ లేదని ఖరాఖండిగా చెప్పేశారు. థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మ్యాగజైన్‌ను చూపించి అందులోని నిబంధనలను వివరించారు. దీంతో సదరు యువతి వారి ప్రవర్తనకు భగ్గుమంది. నేనెలా వుంటే మీకేంటి నన్ను విమానంలో అనుమతించాల్సిందేనని వారితో వాదనకు దిగింది. తోటి ప్రయాణికులు కూడా ఆమెను తప్పుబట్టారు. అంతసేపు వాళ్లతో వాగడం కన్నా రెస్ట్ రూంకు వెళ్లి బట్టలు మార్చుకుని రావచ్చు కదా అని కొందరు ప్రయాణికులు సూచించినా ఆమె ఎవరి మాటా వినలేదు. వాదించినంత సేపు వాదించి విమానం ముందు నిల్చొని ఫోటో‌ దిగి తన నిరసన వ్యక్తం చేసింది.