మెట్రోస్టేషన్ వద్ద ఘోరం.. పెచ్చులూడి యువతి అనంతలోకాలకు..  - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోస్టేషన్ వద్ద ఘోరం.. పెచ్చులూడి యువతి అనంతలోకాలకు.. 

September 22, 2019

Metro station ..

అమీర్ పేట మెట్రో  స్టేషన్ వద్ద ఘోరం జరిగింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఓ యువతి మెట్రో స్టేషన్ కిందకు వెళ్ళి నిలబడింది. ఇంతలో స్టేషన్ పెచ్చులు ఊడి ఆమెపై పడ్డాయి. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షం కురుస్తోందని ఓ వివాహిత మెట్రో స్టేషన్ మెట్ల కిందికి వెళ్లి నిల్చుంది. అప్పుడే పైనుంచి పెచ్చులు ఊడి ఆమె మీద పడ్డాయి. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే చికిత్స జరుగుతుండగానే ఆమె మృతిచెందింది. ఆమె కూకట్ పల్లి, కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(26) గుర్తించారు. ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మెట్రో ప్రయాణికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కట్టిన మెట్రో స్టేషన్‌లో పెచ్చులు ఎలా ఊడుతాయి అని ప్రశ్నిస్తున్నారు.