మా అమ్మకూ వరుడు కావాలి.. అవే షరతులు - MicTv.in - Telugu News
mictv telugu

మా అమ్మకూ వరుడు కావాలి.. అవే షరతులు

November 12, 2019

ఇటీవల ఆస్తా వర్మ అనే ఓ యువతి తన తల్లికి 50ఏళ్ళ వరుడు కావాలని ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం అలవాటు లేనివాడు, అందగాడు, పూర్తి శాకాహారి, బాగా సెటిల్ అయినవాడు కావాలని కొన్ని క్వాలిటీస్ కూడా పోస్ట్ చేసింది. అమ్మతో కలిసిఉన్న ఫోటోను జతచేసింది. దీంతో ఆమె ట్వీట్ వైరల్‌ అయింది. 

తాజాగా మోహినీ విగ్ అనే మరో అమ్మాయి తన 56 ఏళ్ల తల్లికి వరుడు కావలెను అంటూ ట్విట్టర్‌లో ప్రకటన ఇచ్చింది. ‘నా 56 ఏళ్ల తల్లికి 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వరుడు కావలెను. ఆయన శుద్ధ శాకాహారి అయివుండాలి. అదేవిధంగా ఆయనకు పొగ, మధ్యపానం సేవించే అలవాట్లు ఉండకూడదు. నా తల్లిని జీవిత భాగస్వామిగా చేసుకుని ప్రేమించే మనస్తత్వం కలిగివుండాలి. పిల్లల బాధ్యత తీసుకోవాలి’ అని మోహిని పోస్ట్ చేసింది. ఆసక్తి ఉన్నవారు చూడటంకోసం తన తల్లితో దిగిన ఫొటోను కూడా ఆమె ట్విట్టర్లో పెట్టారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.